చాలా రోజుల తరువాత మళ్ళీ అందరికి కలుస్తున్నాను
ఇప్పటి నుంచి ఒక సామెతని తీసుకుని ఆ సామెత ఎందుకొచ్చింది, దానిని ఎక్కడ వాడాలి అని వివరించడనికి ప్రయత్నిస్తాను
""""" పిల్లి మెడలో గంట కట్టేదెవరు ! """"""
ఇది తెలుగు సమెతా లేక ఇంగ్లిష్ నుంచి తార్జుమా చేసినదా అనే విషయం నాకు సరిగ్గా తెలియదు
ఈ సామెతకు సంబంధించి ఒక చిన్న కథ వుంది ఒక ప్రాంతంలో పెద్ద ఎలుకలు గుంపు వుండేది . వాటికి ఆ ప్రాంతంలో చక్కటి ఆహరం దొరకటంతోపాటు ఏవిధమైన భయాలు వుండేవికాదు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి ఒక పిల్లి వచ్చింది. అది రోజు కొన్ని ఎలుకలు తినేసేది. దీంతో భయం వేసి ఎలుకలన్ని సమావేశమయ్యి చర్చించసాగాయి. అప్పుడు ఒక ఎలుక పిల్లి మెడలో గంట కడదామని దాంతో పిల్లి వస్తున్న విషయం ముందుగానె తెలిసిపొయి తాము జగ్రత్త పడవచ్చని సలహా ఇచ్హింది. ఈ సలహా అందరికీ నచ్చి వెంటనే అమలుచేదామని అనుకున్నాయి. అంతా బాగానేవుంది కాని ఇప్పుడు "" పిల్లి మెడలొ గంట కట్టేదెవరు ??"" అని ఒక ముసలి ఎలుక ప్రశ్నించింది.
పై కథలో లాగానే యెవరైనా ఏదైనా అమలు సాధ్యం కాని సలహాలు చెప్పినప్పుదు ఈ సామెతను వాడుతారు
పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!