వెతుకు

Sunday, 29 March 2009

పైరసి Vs బ్లాక్ టికెట్లు

కొద్ది కాలంగా టీవీలలొ మరియు పేపర్లలొ పైరసి గురించి చాలా విన్నాం. కానీ నాకు అర్థం కాని విషయమేమిటంటే నటులు, నిర్మాతలు, అభిమానులు అందరూ పైరసి గురించే గొడవ చేస్థునారు తప్పించి ఒక్కరు బ్లాక్ టికెట్లు గురించి మాట్లడరు గొడవ చేయరు.

ఎప్పుడు చూసినా ఆ నటుడు దాడి చేసి పైరసి సీడిలు పట్టుకున్నాడని, ఇంకెవరో నటుడి అభిమానుల దాడి చేసి పైరసి సీడిలు పట్టుకున్నారని చదవడమే తప్పితే, వీళ్ళెవరు బ్లాక్ టికెట్లు అపినట్టూ వినలేదు చదవలేదు.

ఎప్పుడు చూసినా నటులు, నిర్మాతల సామాజిక స్ప్రుహ గురించి సామాజ సేవ గురించి గొప్పగా వ్రాస్తుంటారు. మరి వీరెవరికి పాపం బ్లాక్ టికెట్లు గురించి తెలియదనుకొందామా ?? ప్రజల, అభిమానుల మరియి సమాజం పట్ల యెంతో ప్రేమ కలిగిన వీరెవ్వరూ బ్లాక్ టికెట్లు గురించి ఎందుకు ఏమీ మాట్లడరు ?? ఏమీ చేయరు ??

నా అభిప్రాయం : ఎందుకంటె నటులకు, నిర్మాతలకు మరియి సినిమా హాలు యజమానులు వీళ్ళందరికీ పైరసి వల్ల మాత్రమే నష్టం. అదే బ్లాక్ టికెట్లు వల్ల కేవలం ప్రెక్షకులకు / ప్రజలకు మాత్రమే నష్టం, పై వారందరికీ లభమే !!

ప్రజలందరూ దీనిని గురించి అలోచిస్థారని ...........